అమెజాన్‌ ‘ఐఫోన్ ఫెస్ట్’: భారీగా తగ్గిన ధరలు..!

ఐపోన్ కొనాలనుకునేవారు ఇప్పుడే కొనేయండి… ఎందుకంటే… భారీ డిస్కౌంట్లతో ఐఫోన్లు లభించనున్నాయి. ఇప్పటికే మోటారోలా ఫోన్లపై ఆఫర్లను ప్రకటించిన అమెజాన్ ఇండియా తాజాగా… ‘ఐఫోన్ ఫెస్ట్’ పేరుతో ఏప్రిల్ 10న మెగా డిస్కౌంట్ సేల్‌ను ప్రారంభించింది. ఇందులో భాగంగా దాదాపుగా అన్ని ఐఫోన్ మోడల్స్ స్మార్ట్‌ఫోన్లు భారీ తగ్గింపు ధరలతో వినియోగదారులకు లభిస్తున్నాయి. ముఖ్యంగా ఐఫోన్ 10( ఎక్స్‌) 256జీబీ రూ.97,999కే అందుబాటులో ఉంది. దీని అసలు ధర రూ.1,08,930గా ఉంది. ఇదే స్మార్ట్‌ఫోన్‌ 64జీబీ వేరియంట్‌ అసలు ధరల రూ.95,390 ఉండగా రూ.79,999 ధరలో లభిస్తుంది.

ఈ సేల్‌లో ‘యాపిల్ వాచ్‌’లపై కూడా డిస్కౌంట్ అందిస్తోంది. ఎంపిక చేసిన వాచ్‌ మోడల్స్‌పై ప్రత్యేక తగ్గింపు ఉంది. హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా చేసే కొనుగోళ్లపై అదనపు డిస్కౌంట్‌‌ను అందిస్తోంది. ఏప్రిల్ 16 వరకు ఈ ప్రత్యేక ఫెస్ట్ కొనసాగనుంది.

కాలా ఫస్ట్ కాపీ రివ్యూ.. రజనీ ఈజ్  బ్యాక్.. మైండ్ బ్లోయింగ్.. రికార్డులు బ్రేక్

కబాలి చిత్రం తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కాలా. ఈ చిత్రానికి నిర్మాతగా హీరో ధనుష్ వ్యవహరిస్తున్నారు. వాస్తవానికి ఈ చిత్రం ఏప్రిల్ 27న రిలీజ్ కావాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ వాయిదా ఇటీవలే కాలా సినిమా ఫస్ట్ కాపీ బయటకువచ్చింది. కాలా ఫస్ట్ కాపీ గురించి సినీ విమర్శకుడు ఉమేర్ సంధూ ట్వీట్ చేశారు. కాలా ఫస్ట్ కాపీ వచ్చేసింది. సినిమా రెస్పాన్స్ వింటే మైండ్ బ్లోయిగ్‌గా ఉంది. చిత్ర యూనిట్ వాళ్లు వెల్లడించిన ప్రకారం. కాలా మాస్ ఎంటర్‌టైనర్ అని తెలిసింది. రజనీకాంత్ తన పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్‌తో మళ్లీ బ్యాక్ వచ్చేయడం ఖాయమట. దక్షిణాదిలో రికార్డులను తిరుగరాయడం ఖాయం అని ఉమేర్ ట్వీట్ చేశారు.

చెపాక్‌లో కోల్‌కతాతో మ్యాచ్: ఉత్కంఠ  పోరులో చెన్నై ఘన విజయం

హైదరాబాద్: సొంతగడ్డపై మంగళవారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్‌కతా నైట్ రైడర్స్ నిర్దేశించిన 203 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి చెన్నై చేధించింది. శామ్ బిల్లింగ్స్(23 బంతుల్లో 56), వాట్సన్(19 బంతుల్లో 42), రాయుడు(26 బంతుల్లో 39) రాణించడంతో 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.

వినయ్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లో 17 పరుగులు అవసరం కాగా.. తొలి బంతిని బ్రావో సిక్స్‌గా మలిచాడు. ఇక ఐదో బంతిని రవీంద్ర జడేజా సిక్స్‌గా మలిచి మ్యాచ్‌ని లాంఛనాన్ని ముగించాడు. ఇక, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఈ మ్యాచ్‌లో 28 బంతుల్లో 25 పరుగులు చేసి ఔటయ్యాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన కోల్‌కతా 202 పరుగుల చేసింది.