ముంబై మురిసె

ుంబై ఇండియన్స్‌కు గెలుపు మురిపెం.. గత మూడు మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడి… మొదట బ్యాటింగ్‌కు దిగి… చివరి ఓవర్‌లో పరాజయం పాలైన ఆ జట్టు… ఈ సారీ టాస్‌ ఓడినా, మొదట బ్యాటింగే చేసినా, విజయం ఖాయం చేసుకునేందుకు ఆఖరి ఓవర్‌ వరకు ఎదురుచూడాల్సిన పని లేకపోయింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై తమ సొంత మైదానం వాంఖెడేలో కెప్ట

ముంబై: కెప్టెన్ల మధ్య బ్యాటింగ్‌ సమరమా? అన్నట్లు సాగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లిపై రోహిత్‌ శర్మదే పైచేయి అయింది. ప్రారంభంలో తడబడినా నిలదొక్కుకుని ఆడిన ముంబై ఇండియన్స్‌… రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును 46 పరుగుల తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై… కెప్టెన్‌ రోహిత్‌ (52 బంతుల్లో 94; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఓపెనర్‌ ఎవిన్‌ లూయీస్‌ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

కోహ్లి (62 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కనీస పరుగులు కూడా చేయలేకపోవడంతో బెంగళూరు ఛేదనలో తేలిపోయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడిపోయింది. ముంబై బౌలర్లలో కృనాల్‌ (3/28), బుమ్రా (2/28), మెక్లీనగన్‌ (2/24) క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కోలు కోనివ్వలేదు. రోహిత్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

ఆరంభం బాగోలేకున్నా…
0/2… ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులకు ముంబై పరిస్థితిది. ఈ సీజన్‌లో స్థిరంగా రాణిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (0), ఇషాన్‌ కిషన్‌ (0)లు ఉమేశ్‌ పేస్‌ ధాటికి ఖాతా తెరవకుండానే బౌల్డ్‌ అయ్యారు. ఇలాంటి దశ నుంచి పైకి లేచి భారీ స్కోరు సాధించిందంటే ఆ ఘనతంతా లూయీస్, రోహిత్‌దే. వికెట్లు కోల్పోయిన ప్రభావం నుంచి జట్టును వీరు త్వరగానే బయట పడేశారు.

ధాటిగా ఆడుతూ మూడో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ముంబైను ఆదుకున్నారు. రోహిత్‌ జోరు చూస్తుంటే అతను సెంచరీ చేయడం ఖాయంగా కనిపించినా… అతనికి 18వ ఓవర్‌లో ఒక్క బంతే ఆడే అవకాశం వచ్చింది. అండర్సన్‌ వేసిన చివరి ఓవర్‌లో ఫోర్, సిక్స్, ఫోర్‌తో శతకానికి చేరువైనా మరో భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో వోక్స్‌ క్యాచ్‌ పట్టడంతో అవుటయ్యాడు.

ఆరంభం బాగున్నా…
డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ మెకల్లమ్‌ను పక్కన పెట్టడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డికాక్, కోహ్లి లక్ష్యానికి తగ్గట్లు 4 ఓవర్లలోనే 40 పరుగులు జోడించారు. కానీ, డికాక్, డివిలియర్స్‌ (1)లను మూడు బంతుల వ్యవధిలో అవుట్‌ చేసి మెక్లీనగన్‌ దెబ్బ కొట్టాడు. స్పిన్నర్ల కట్టుదిట్ట బంతులతో బౌండరీలే కష్టమై రన్‌రేట్‌ పడిపోయింది. కృనాల్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి మన్‌దీప్‌ సింగ్‌ (16) స్టంపౌటయ్యాడు.

హిట్టర్‌గా ఆశలు పెట్టుకున్న అండర్సన్‌ (0) మరుసటి బంతికే పేలవ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. అవతలి ఎండ్‌లో కోహ్లి నిలదొక్కుకుని షాట్లు కొడుతున్నా సుందర్‌ (7), సర్ఫరాజ్‌ (5), వోక్స్‌ (11) ఇలా అందరూ నిరాశపర్చారు. దీంతో బెంగళూరు చేసేదేమీ లేకపోయింది. బెంగళూరు ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా వేసిన త్రో వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కంటికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అతడు మైదానం వీడాడు. దీంతో ఆదిత్య తారే బాధ్యతలు తీసుకున్నాడు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ (బి) ఉమేశ్‌ 0; లూయిస్‌ (సి) డికాక్‌ (బి) అండర్సన్‌ 65; ఇషాన్‌ కిషన్‌ (బి) ఉమేశ్‌ 0; రోహిత్‌ శర్మ (సి) వోక్స్‌ (బి) అండర్సన్‌ 94; కృనాల్‌ పాండ్యా రనౌట్‌ 15; పొలార్డ్‌ (సి) డివిలియర్స్‌ (బి) వోక్స్‌ 5; హార్దిక్‌ పాండ్యా నాటౌట్‌ 17; మెక్లీనగన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 213.
వికెట్ల పతనం: 1–0, 2–0, 3–108, 4–148, 5–178, 6–207. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4–0–36–2, వోక్స్‌ 3–0–31–1, వాషింగ్టన్‌ సుందర్‌ 2–0–32–0, సిరాజ్‌ 4–0–34–0, చహల్‌ 3–0–32–0, అండర్సన్‌ 4–0–47–2.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి నాటౌట్‌ 92; డికాక్‌ (బి) మెక్లీనగన్‌ 19; డివిలియర్స్‌ (సి) హార్దిక్‌ (బి) మెక్లీనగన్‌ 1; మన్‌దీప్‌ సింగ్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) కృనాల్‌ 16; అండర్సన్‌ (సి) సబ్‌–డుమిని (బి) కృనాల్‌ 0; సుందర్‌ (సి) ఉమేశ్‌ (బి) కృనాల్‌ 7; సర్ఫరాజ్‌ (స్టంప్డ్‌) సబ్‌–ఆదిత్య తారే (బి) మార్కండే 5; వోక్స్‌ (సి) కృనాల్‌ (బి) బుమ్రా 11; ఉమేశ్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 1; సిరాజ్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167.
వికెట్ల పతనం: 1–40, 2–42, 3–75, 4–75, 5–86, 6–103, 7–135, 8–137. బౌలింగ్‌: బుమ్రా 4–0–28–2, కృనాల్‌ 4–0–28–3, మెక్లీనగన్‌ 3–0–24–2, ముస్తఫిజుర్‌ 4–0–55–0, మార్కండే 4–0–25–1, హార్దిక్‌ 1–0–4–0.

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ vs కోల్‌కతా
వేదిక: జైపూర్, రా.గం. 8 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

ముంబై ఇండియన్స్‌కు గెలుపు మురిపెం.. గత మూడు మ్యాచ్‌ల్లో టాస్‌ ఓడి… మొదట బ్యాటింగ్‌కు దిగి… చివరి ఓవర్‌లో పరాజయం పాలైన ఆ జట్టు… ఈ సారీ టాస్‌ ఓడినా, మొదట బ్యాటింగే చేసినా, విజయం ఖాయం చేసుకునేందుకు ఆఖరి ఓవర్‌ వరకు ఎదురుచూడాల్సిన పని లేకపోయింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై తమ సొంత మైదానం వాంఖెడేలో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఘనమైన బ్యాటింగ్‌ రికార్డును కాపాడుకుంటూ చెలరేగడంతో ముంబై ఖాతా తెరిచింది.

ముంబై: కెప్టెన్ల మధ్య బ్యాటింగ్‌ సమరమా? అన్నట్లు సాగిన మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లిపై రోహిత్‌ శర్మదే పైచేయి అయింది. ప్రారంభంలో తడబడినా నిలదొక్కుకుని ఆడిన ముంబై ఇండియన్స్‌… రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును 46 పరుగుల తేడాతో ఓడించింది. రెండు జట్ల మధ్య మంగళవారం ఇక్కడ జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో టాస్‌ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ముంబై… కెప్టెన్‌ రోహిత్‌ (52 బంతుల్లో 94; 10 ఫోర్లు, 5 సిక్స్‌లు), ఓపెనర్‌ ఎవిన్‌ లూయీస్‌ (42 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) విజృంభణతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 213 పరుగుల భారీ స్కోరు చేసింది.

కోహ్లి (62 బంతుల్లో 92 నాటౌట్‌; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ఒంటరి పోరాటం మినహా ప్రధాన బ్యాట్స్‌మెన్‌ కనీస పరుగులు కూడా చేయలేకపోవడంతో బెంగళూరు ఛేదనలో తేలిపోయి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడిపోయింది. ముంబై బౌలర్లలో కృనాల్‌ (3/28), బుమ్రా (2/28), మెక్లీనగన్‌ (2/24) క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని కోలు కోనివ్వలేదు. రోహిత్‌కే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ దక్కింది.

ఆరంభం బాగోలేకున్నా…
0/2… ఇన్నింగ్స్‌ తొలి రెండు బంతులకు ముంబై పరిస్థితిది. ఈ సీజన్‌లో స్థిరంగా రాణిస్తున్న సూర్యకుమార్‌ యాదవ్‌ (0), ఇషాన్‌ కిషన్‌ (0)లు ఉమేశ్‌ పేస్‌ ధాటికి ఖాతా తెరవకుండానే బౌల్డ్‌ అయ్యారు. ఇలాంటి దశ నుంచి పైకి లేచి భారీ స్కోరు సాధించిందంటే ఆ ఘనతంతా లూయీస్, రోహిత్‌దే. వికెట్లు కోల్పోయిన ప్రభావం నుంచి జట్టును వీరు త్వరగానే బయట పడేశారు.

ధాటిగా ఆడుతూ మూడో వికెట్‌కు 108 పరుగుల భాగస్వామ్యాన్ని జోడించి ముంబైను ఆదుకున్నారు. రోహిత్‌ జోరు చూస్తుంటే అతను సెంచరీ చేయడం ఖాయంగా కనిపించినా… అతనికి 18వ ఓవర్‌లో ఒక్క బంతే ఆడే అవకాశం వచ్చింది. అండర్సన్‌ వేసిన చివరి ఓవర్‌లో ఫోర్, సిక్స్, ఫోర్‌తో శతకానికి చేరువైనా మరో భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో వోక్స్‌ క్యాచ్‌ పట్టడంతో అవుటయ్యాడు.

ఆరంభం బాగున్నా…
డాషింగ్‌ బ్యాట్స్‌మన్‌ మెకల్లమ్‌ను పక్కన పెట్టడంతో బెంగళూరు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన డికాక్, కోహ్లి లక్ష్యానికి తగ్గట్లు 4 ఓవర్లలోనే 40 పరుగులు జోడించారు. కానీ, డికాక్, డివిలియర్స్‌ (1)లను మూడు బంతుల వ్యవధిలో అవుట్‌ చేసి మెక్లీనగన్‌ దెబ్బ కొట్టాడు. స్పిన్నర్ల కట్టుదిట్ట బంతులతో బౌండరీలే కష్టమై రన్‌రేట్‌ పడిపోయింది. కృనాల్‌ బౌలింగ్‌లో ముందుకొచ్చి ఆడబోయి మన్‌దీప్‌ సింగ్‌ (16) స్టంపౌటయ్యాడు.

హిట్టర్‌గా ఆశలు పెట్టుకున్న అండర్సన్‌ (0) మరుసటి బంతికే పేలవ షాట్‌కు యత్నించి నిష్క్రమించాడు. అవతలి ఎండ్‌లో కోహ్లి నిలదొక్కుకుని షాట్లు కొడుతున్నా సుందర్‌ (7), సర్ఫరాజ్‌ (5), వోక్స్‌ (11) ఇలా అందరూ నిరాశపర్చారు. దీంతో బెంగళూరు చేసేదేమీ లేకపోయింది. బెంగళూరు ఇన్నింగ్స్‌ 13వ ఓవర్లో హార్దిక్‌ పాండ్యా వేసిన త్రో వికెట్‌ కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ కంటికి బలంగా తాకింది. నొప్పితో విలవిల్లాడిన అతడు మైదానం వీడాడు. దీంతో ఆదిత్య తారే బాధ్యతలు తీసుకున్నాడు.

స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: సూర్యకుమార్‌ (బి) ఉమేశ్‌ 0; లూయిస్‌ (సి) డికాక్‌ (బి) అండర్సన్‌ 65; ఇషాన్‌ కిషన్‌ (బి) ఉమేశ్‌ 0; రోహిత్‌ శర్మ (సి) వోక్స్‌ (బి) అండర్సన్‌ 94; కృనాల్‌ పాండ్యా రనౌట్‌ 15; పొలార్డ్‌ (సి) డివిలియర్స్‌ (బి) వోక్స్‌ 5; హార్దిక్‌ పాండ్యా నాటౌట్‌ 17; మెక్లీనగన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 213.
వికెట్ల పతనం: 1–0, 2–0, 3–108, 4–148, 5–178, 6–207. బౌలింగ్‌: ఉమేశ్‌ యాదవ్‌ 4–0–36–2, వోక్స్‌ 3–0–31–1, వాషింగ్టన్‌ సుందర్‌ 2–0–32–0, సిరాజ్‌ 4–0–34–0, చహల్‌ 3–0–32–0, అండర్సన్‌ 4–0–47–2.
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి నాటౌట్‌ 92; డికాక్‌ (బి) మెక్లీనగన్‌ 19; డివిలియర్స్‌ (సి) హార్దిక్‌ (బి) మెక్లీనగన్‌ 1; మన్‌దీప్‌ సింగ్‌ (స్టంప్డ్‌) ఇషాన్‌ కిషన్‌ (బి) కృనాల్‌ 16; అండర్సన్‌ (సి) సబ్‌–డుమిని (బి) కృనాల్‌ 0; సుందర్‌ (సి) ఉమేశ్‌ (బి) కృనాల్‌ 7; సర్ఫరాజ్‌ (స్టంప్డ్‌) సబ్‌–ఆదిత్య తారే (బి) మార్కండే 5; వోక్స్‌ (సి) కృనాల్‌ (బి) బుమ్రా 11; ఉమేశ్‌ (సి) రోహిత్‌ (బి) బుమ్రా 1; సిరాజ్‌ నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167.
వికెట్ల పతనం: 1–40, 2–42, 3–75, 4–75, 5–86, 6–103, 7–135, 8–137. బౌలింగ్‌: బుమ్రా 4–0–28–2, కృనాల్‌ 4–0–28–3, మెక్లీనగన్‌ 3–0–24–2, ముస్తఫిజుర్‌ 4–0–55–0, మార్కండే 4–0–25–1, హార్దిక్‌ 1–0–4–0.

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ vs కోల్‌కతా
వేదిక: జైపూర్, రా.గం. 8 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

ఇట్స్‌ వెయిటింగ్‌ టైమ్‌

రావడంలేదు.. ఈ ఏడాది ప్రభాస్‌ సిల్వర్‌ స్క్రీన్‌కి రావడంలేదు. టూ పార్ట్స్‌గా వచ్చిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ కోసం ప్రభాస్‌ ఫైవ్‌ ఇయర్స్‌ టైమ్‌ కేటాయించి.. ఐదేళ్లలో రెండుసార్లు మాత్రమే సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించారు. ఆయన నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ ‘సాహో’ టీజర్‌ను ‘బాహుబలి 2’ రిలీజ్‌కు ఒక్కరోజు ముందు విడుదల చేశారు. ‘ఇన్‌ థియేటర్స్‌ 2018’ అని టీజర్‌ ఎండ్‌ అవుతుంది. అలాగే ఆ టీజర్‌లో ‘ఇట్స్‌ షో టైమ్‌’ అని ప్రభాస్‌ డైలాగ్‌ చెబుతారు. ఈ ఏడాది వెండితెరపై ‘సాహో’ చిత్రంలో ప్రభాస్‌ను చూడొచ్చనుకున్నారు సినీ ప్రేమికులు. కానీ ‘సాహో’ చిత్రం ఈ ఏడాది విడుదల కావడం లేదని దాదాపు కన్ఫార్మ్‌ అయినట్టే. సో.. ‘ఇట్స్‌ వెయిటింగ్‌ టైమ్‌’ అన్నమాట. ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్న సినిమా ‘సాహో’.

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇందులో శ్రద్ధా కపూర్‌ కథానాయిక. అరుణ్‌ విజయ్, నీల్‌ నితిన్‌ ముఖేష్, మందిరా బేడీ కీలక పాత్రలు చేస్తున్నారు. తాజా సమాచారం ఏంటంటే.. ఈ సినిమా హిందీ వెర్షన్‌ను టీ సీరీస్‌ అధినేత, నిర్మాత భూషణ్‌ కుమార్‌ రిలీజ్‌ చేయనున్నారు. ‘సాహో’ చిత్రం థియేటర్స్‌లోకి వచ్చేది నెక్ట్స్‌ ఇయరే అని బీ టౌన్‌ స్ట్రాంగ్‌ టాక్‌. ‘సాహో’కి బోలెడంత సీజీ వర్క్‌ ఉంటుందని టీజర్‌ ఎండ్‌ షాట్స్‌ చూస్తే అర్థం అవుతుంది. సో.. ఈ ఏడాది ప్రభాస్‌ థియేటర్స్‌లోకి రావడం కష్టమే. ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్‌ అబుదాబీలో జరుగుతోంది. ‘‘అబుదాబిలో జరుగుతున్న ‘సాహో’ షూటింగ్‌లో పాల్గొన్నాను’’ అని పేర్కొన్నారు నీల్‌ నితిన్‌ ముఖేష్‌.

దంచికొట్టిన ఎండలు 

రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. మంగళవారం ఆదిలాబాద్, భద్రాచలం, నిజామాబాద్, రామగుండంలో 42 డిగ్రీల సెల్సియస్‌ చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్‌లలో 40 డిగ్రీల చొప్పున రికార్డు అయ్యాయి. హైదరాబాద్‌లో 39.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్‌నగర్, గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వానలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది

బ్యాంక్‌ డల్‌.. ఏటీఎం నిల్‌

ఏటీఎంకు వెళ్తే నో క్యాష్‌.. బ్యాంకుకు వెళ్తే గంటలకొద్దీ పడిగాపులు.. అంతసేపు నిరీక్షించినా పది వేలు దక్కితే అదే మహాభాగ్యం.. ముందురోజు వ్యాపారం ద్వారా వచ్చిన నగదును గ్యాస్‌ ఏజెన్సీలు, పెట్రోల్‌ బంకుల యాజమాన్యాలు తెచ్చి డిపాజిట్‌ చేస్తేగానీ సేవింగ్స్‌ ఖాతాదారులకు డబ్బులివ్వని పరిస్థితి.. హైదరాబాద్‌లోని బ్యాంకుల్లో ఇదీ దుస్థితి! మిగతా జిల్లాల్లోనూ పరిస్థితి ఇందుకు భిన్నంగా లేదు. ఏటీఎంలన్నీ మూతపడ్డాయి. ఎక్కడికి వెళ్లినా నో క్యాష్‌ బోర్డులే కనిపిస్తుండటంతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. బ్యాంకులకు వాటికిచ్చే నిష్పత్తి ప్రకారమే నగదు అందజేస్తున్నామని, హైదరాబాద్‌లోని బ్యాంకులకు ఈ నెల మొదటి వారంలో రమారమి రూ.3000 కోట్ల పైచిలుకు అందజేశామని రిజర్వ్‌ బ్యాంక్‌ చెబుతోంది.

మరి అంత డబ్బు వచ్చినా ఖాతాదారులకు ఎందుకు చేరడం లేదన్న ప్రశ్నకు ఆర్‌బీఐ సమాధానం చెప్పలేకపోతోంది. ‘‘బ్యాంకు మేనేజర్లు విచక్షణ కోల్పోయి వ్యవహరిస్తున్నట్లు కొన్ని కేసులను పరిశీలిస్తే అర్థమైంది. ఆబిడ్స్‌లో ఓ బ్యాంకుకు వారి ప్రధాన కార్యాలయం నుంచి ఈ నెల 6న రూ.175 కోట్లు వెళ్లాయి. ఆ మొత్తం నగదును సదరు బ్యాంకు మేనేజర్‌ కేవలం ముగ్గురు ఖాతాదారులకే పంపిణీ చేశారు. దీనిపై విచారణ జరుగుతోంది’’అని ఆర్‌బీఐ సీనియర్‌ అధికారి ఒకరు వెల్లడించారు. ఏటీఎంలు, బ్యాంకుల్లో నగదు కొరతకు బ్యాంకుల మధ్య సమన్వయ లోపం కూడా ఓ కారణమని ఆయన పేర్కొన్నారు. బుధవారం నుంచి నగదు కొరత రాకుండా కొన్ని చర్యలు తీసుకోబోతున్నామని, అందుకు ప్రధాన బ్యాంకులకు కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేశామని ఆ అధికారి చెప్పారు.

మూతపడుతున్న ఏటీఎంలు
అభివృద్ధి చెందిన లేదా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏటీఎంల సంఖ్య ఏటికేటా పెరిగిపోతోంది. ప్రతి వంద మీటర్లకు ఓ ఏటీఎం అందుబాటులో ఉండాలన్న లక్ష్యంతో చర్యలు తీసుకుంటున్నాయి. కానీ ఇక్కడ మాత్రం బ్యాంకులు తిరోగమనంలో పయనిస్తున్నాయి. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ తన 30 శాతం ఏటీఎంలలో నెలల తరబడి నగదును లోడ్‌ చేయడం లేదు. పెద్దనోట్ల రద్దు నాటి నుంచీ ఆ ఏటీఎంలను నిరర్థకంగా ఉంచింది. వాటిలో నగదు విచారణ, చెక్‌ బుక్‌ రిక్వెస్ట్‌ వంటి సర్వీసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణలో అన్ని బ్యాంకులకు కలిపి 8,781 ఏటీఎంలు ఉండగా.. అందులో పెద్దనోట్లు రద్దయినప్పట్నుంచీ దాదాపు 40 శాతం అంటే 3,800 ఏటీఎంల్లో నగదు లోడ్‌ చేయడం లేదు. మరో 20 శాతం ఏటీఎంలలో వారానికి ఒకసారి మాత్రమే నగదు ఉంచుతున్నారు. మొత్తంగా 40 శాతం ఏటీఎంల్లోనే నగదు లోడ్‌ చేస్తున్నారు. క్రమేపీ వాటి సంఖ్య కూడా తగ్గిస్తూ వస్తున్నారు. తాజాగా పరిశీలిస్తే వెయ్యి లోపు ఏటీఎంల్లోనే నగదు అందుబాటులో ఉంచినట్టు స్పష్టమవుతోంది. అదీ క్యాష్‌ పెట్టిన గంటలోపే అయిపోతోంది. కొన్ని ఏటీఎంల్లో రూ.4 వేలకు మించి రాకుండా మార్పులు చేశారు. దీంతో ఖాతాదారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే మరో నాలుగైదు రోజుల్లో ఈ పరిస్థితిలో మార్పు వస్తుందని ఎస్‌బీఐ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఒకరు చెప్పారు.

జైట్లీకి కేటీఆర్‌ కౌంటర్‌
తెలంగాణ సహా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నెలకొన్న నగదు కొరతపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పందిసూ.. ఇది ఆకస్మాత్తుగా ఏర్పడ్డ ఇబ్బంది అని వివరణ ఇచ్చారు. అయితే దీనికి మంత్రి కె.తారక రామారావు కౌంటర్‌ ఇచ్చారు. బ్యాంకులు, ఏటీఎంలలో నగదు కొరత ఆకస్మికంగా ఏర్పడ లేదంటూ ట్వీటర్‌లో బదులిచ్చారు. నగదు కొరతపై గత మూడు నెలలుగా పదేపదే ఫిర్యాదులు తన దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థపై ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్న ఈ సమస్యపై ఆర్థిక శాఖ, ఆర్బీఐ లోతుగా పరిశీలన జరపాలని సూచించారు.