
కోల్‌కతా నైట్‌రైడర్స్ వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. తమ చివరి మ్యాచ్‌లో ఢిల్లీని కుప్పకూల్చిన కోల్‌కతా స్పిన్నర్లు ఈసారీ మెరుగైన ప్రదర్శన కనబరిచారు. ఏకంగా 14 ఓవర్లు వేసిన వీరు రాజస్థాన్ కోల్పోయిన ఆరు వికెట్లలో నాలుగింటిని పడగొట్టారు.. వీరి ధాటికి రాజస్థాన్ రాయల్స్ స్వల్ప స్కోరుకే పరిమితం కాగా.. ఆ తర్వాత ఓ మాదిరి లక్ష్యాన్ని బ్యాట్స్‌మెన్ సమష్టి రాణింపుతో ఎలాంటి తడబాటు లేకుండా కోల్‌కతా సునాయాసంగా ఛేదించింది.
హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన రాజస్థాన్ రాయల్స్‌కు సొంత గడ్డపై పరాభవం ఎదురైంది. బౌలింగ్, బ్యాటింగ్‌లో రాణించిన కోల్‌కతా నైట్‌రైడర్స్ బుధవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో నెగ్గింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 160 పరుగులు చేసింది. షార్ట్ (43 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 44), రహానె (19 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 36) మాత్రమే రాణించారు. రాణా, కరాన్ రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత బరిలోకి దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో మూడు వికెట్లకు 163 పరుగులు చేసి గెలిచింది. రాబిన్ ఊతప్ప (36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 48), సునీల్ నరైన్ (25 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 35) శుభారంభం చేయగా నితీష్ రాణా (27 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 35 నాటౌట్), దినేశ్ కార్తీక్ (23 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 42 నాటౌట్) చివర్లో చెలరేగారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ నితీష్ రాణాకు దక్కింది.
రాణించిన టాపార్డర్: తొలి ఓవర్లోనే కోల్‌కతా లిన్ వికెట్ కోల్పోయింది. కానీ ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రతీ బ్యాట్స్‌మన్ తమ వంతుగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. నరైన్, ఊతప్ప జోడీ వరుస బౌండరీలతో స్కోరును కదం తొక్కించింది. నాలుగో ఓవర్లో నరైన్ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగగా.. ఆ తర్వాత ఓవర్లో ఊతప్ప సైతం మూడు ఫోర్లు బాదాడు. తొమ్మిది ఓవర్ల పాటు వీరిద్దరూ ఎలాంటి ఇబ్బంది లేకుండా రాజస్థాన్ బౌలర్లను ఎదుర్కొంటూ పరుగులు సాధించారు. అయితే లేని పరుగు కోసం వెళ్లిన నరైన్ రనౌట్ అయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 69 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఊతప్ప లాంగ్ ఆన్‌లో భారీ షాట్ ఆడగా బౌండరీ లైన్ దగ్గర స్టోక్స్ అద్భుతంగా క్యాచ్ తీసుకున్నాడు. అనంతరం మూడు ఓవర్లలో ఒక్క ఫోర్ కూడా ఇవ్వకుండా రాజస్థాన్ బౌలర్లు కట్టడి చేశారు. కానీ 17వ ఓవర్లో దినేశ్ కార్తీక్, రాణా చెరో సిక్సర్‌తో 16 పరుగులు రాబట్టారు. ఇక చివరి 18 బంతుల్లో 19 పరుగులు రావాల్సి ఉండగా మరో ఏడు బంతులుండగానే నెగ్గింది.
మెరుపుల్లేని ఇన్నింగ్స్: రాజస్థాన్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే నిదానంగా సాగింది. కోల్‌కతా బౌలింగ్‌కు పరుగులు తీసేందుకు బ్యాట్స్‌మెన్ ఇబ్బందిపడ్డారు. తొలి మూడు ఓవర్ల వరకు ఒక్క బౌండరీ కూడా లేదు. అప్పటికి స్కోరు కేవలం 9 పరుగులే. అయితే నాలుగో ఓవర్లో కెప్టెన్ రహానె వరుసగా నాలుగు ఫోర్లతో చెలరేగి ఒక్కసారిగా ఊపు తెచ్చాడు. ఆ తర్వాత కూడా ఓ సిక్స్, ఫోర్‌తో ఆకట్టుకున్నా ఏడో ఓవర్లో అతడిని కీపర్ కార్తీక్ మెరుపు వేగంతో స్టంప్ అవుట్ చేశాడు. ఆ వెంటనే బెంగళూరుపై దుమ్మురేపిన శాంసన్ (7) శివమ్ మావి బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఊపు మీదున్న షార్ట్ 12వ ఓవర్లో వరుసగా 6,4తో ఆకట్టుకున్నాడు. కానీ 13వ ఓవరల్ రాణా అతడిని బౌల్డ్ చేయగా మరుసటి ఓవర్లో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్.. త్రిపాఠి (15) పనిపట్టాడు. ఎప్పటిలాగే స్టోక్స్ (14) మరోసారి నిరాశపరచగా చివర్లో బట్లర్ (24 నాటౌట్) ఓ మాదిరి ఆటతో రాయల్స్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. ఆఖరి ఓవర్లో మావి మూడు వైడ్లు వేసినా 8 పరుగులే వచ్చాయి.
స్కోరుబోర్డు
రాజస్థాన్: రహానె (స్టంప్డ్) దినేశ్ కార్తీక్ (బి) రాణా 36; షార్ట్ (బి) రాణా 44; శాంసన్ (సి) కుల్దీప్ (బి) మవీ 7; త్రిపాఠి (సి) రస్సెల్ (బి) కుల్దీప్ 15; స్టోక్స్ (సి) రాణా (బి) చావ్లా 14; బట్లర్ (నాటౌట్) 24; గౌతమ్ (సి) మావి (బి) కర్రాన్ 12; గోపాల్ (బి) కర్రాన్ 0; కులకర్ణి (రనౌట్) 3; ఉనాద్కట్ (నాటౌట్) 0;
ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 160/8.
వికెట్ల పతనం: 1-54, 2-62, 3-98, 4-106, 5-122, 6-141, 7-141, 8-160.
బౌలింగ్: చావ్లా 4-0-18-1; కుల్దీప్ 4-0-23-1; నరైన్ 4-0-48-0; మావి 4-0-40-1; రాణా 2-0-11-2; కర్రాన్ 2-0-19-2.
కోల్‌కతా: నరైన్ (రనౌట్) 35; లిన్ (బి) గౌతమ్ 0; ఊతప్ప (సి) స్టోక్స్ (బి) గౌతమ్ 48; రాణా నాటౌట్ 35; దినేశ్ కార్తీక్ నాటౌట్ 42;
ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 18.5 ఓవర్లలో 163/3.
వికెట్ల పతనం: 1-1, 2-70, 3-102.
బౌలింగ్: గౌతమ్ 4-0-23-2; కులకర్ణి 2-0-20-0; ఉనాద్కట్ 3-0-34-0; లాంగ్లిన్ 3.5-0-37-0; గోపాల్ 3-0-23-0; స్టోక్స్ 3-0-25-0.
Share //pagead2.googlesyndication.com/pagead/js/adsbygoogle.js (adsbygoogle = window.adsbygoogle || []).push({ google_ad_client: "ca-pub-4767021749204171", enable_page_level_ads: true }); this: Share chart
Like this:
Like Loading...