ఆ ముఖ్యమంత్రికి 100 కోట్లు 

‘భ‌ర‌త్ అనే నేను’ సినిమా ద్వారా ముఖ్యమంత్రి పాత్రలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సూప‌ర్‌స్టార్ మహేష్‌బాబు అద‌ర‌గొడుతున్నాడు. ముఖ్యమంత్రిగా మ‌హేష్ న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను బాగా ఆక‌ట్టుకుంటోంది. హ్యాట్రిక్ విజ‌యాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ తెర‌కెక్కించిన ఈ సినిమా విడుద‌లైన మొద‌టి షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ‘భ‌ర‌త్‌’ ఖాతాలో ప‌లు రికార్డులు చేరుతున్నాయి.
ఇప్పటికే మ‌హేష్ కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా నిలిచిన ‘భ‌ర‌త్ అనే నేను’.. తాజాగా మరో ఫీట్ సాధించింది. ఏప్రిల్ 20న విడుదలైన ఈ సినిమా ఇప్పటికి 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి రికార్డు దిశగా పరుగులు పెడుతోంది. మొదటి రోజు నుండే ఎంతో స్ట్రాంగ్‌గా దూసుకుపోతున్న భరత్.. మూడో రోజు (నేడు) మరింత వేగం పెంచేశాడు. హాలిడే సమయం కావడంతో ముఖ్యమంత్రి గా మహేష్‌ని చూసేందుకు అందరూ థియేటర్ల బాట పట్టారు.

ముఖంపై జిడ్డు పోవాలంటే…

  • శెనగపిండి చర్మంపై మలినాలను పోగొడుతుంది. ముఖం మీద టాన్‌ పోవడానికి ఫేస్‌ప్యాక్‌లా దీన్ని వాడొచ్చు.
  • శెనగపిండిలో పెరుగు, నిమ్మరసం, చిటికెడు పసుపు కలిపి లేదా శెనగపిండిలో బాదం పేస్టు, పాలు, నిమ్మరసం కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని 30నిమిషాలు ఉంచుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం కాంతివంతంగా తయారవుతుంది.
  • ముఖం మీద ఉన్న జిడ్డు పోవాలంటే శెనగపిండిలో పెరుగు వేసి పేస్టులా చేసి ముఖానికి రాసుకుని 20 నిమిషాల తర్వాత నీళ్లతో కడగాలి.
  • చర్మంపై మొటిమలు బాగా ఉంటే శెనగపిండిలో శాండల్‌వుడ్‌ పేస్టు, పసుపు, పాలు కలిపి పేస్టులా చేసి ముఖానికి రాసుకొని, ఇరవై నిమిషాల తర్వాత నీళ్లతో కడగాలి.

నేల మీద కూర్చుని భోజనం చేస్తే ఏమవుతుందంటే…

ప్రస్తుతం చాలామంది డైనింగ్ టేబుల్‌పై భోజనానికి అలవాటుపడ్డారు. అయితే ఇది ఆరోగ్యరీత్యా సరైన విధానం కాదని వైద్యులు చెబుతుంటారు. పాతకాలంలో నేలమీదకూర్చుని భోజనం చేసే సంప్రదాయం ఉండేది. ఇలా చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. నేలపై కూర్చుని భోజనం చేసే సమయంలో మనం సుఖాసనంలో కూర్చోవలసి వస్తుంది. సుఖాసనం అనేది పద్మాసనం లాంటిదే. పద్మాసనం కారణంగా శరీరానికి ఏ ప్రయోజనాలు చేకూరుతాయో, సుఖాసనంలో కూడా అవే ప్రయోజనాలుంటాయి. కూర్చుని తినడంవలన ఆహారాన్నిచక్కగా స్వీకరించగలుగుతాం. ఈ ఆసనం ఏకాగ్రతను కూడా ప్రసాదిస్తుంది. రక్త ప్రసరణ దేహమంతటా సమాన రీతిలో ఉండేలా చూస్తుంది. తద్వారా శరీరానికి అదనపు శక్తి లభిస్తుంది. ఈ విధంగా భోజనం చేయడం వలన అధిక బరువు, మలబద్ధకం, గ్యాస్ తదితర ఉదర సంబంధిత సమస్యలు దరిచేరవు. ఈ ఆసనంలో కూర్చోవటం వలన నడుంనొప్పి నుంచి విముక్తి లభిస్తుంది.

పవన్ కల్యాణ్ కాస్తా పనిలేని కల్యాణ్‌గా మారి..: కత్తి 

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మళ్లీ ఇటీవలే వార్ ప్రకటించిన కత్తి మహేష్ తన పోస్ట్‌లతో హడలెత్తిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సద్దు మణిగిన వార్ మళ్లీ రాజుకుంది. పవన్ కల్యాణ్ గురించి కత్తి మహేష్ ట్వీట్స్ ఊపందుకున్నాయి. శనివారం అన్నపూర్ణ 7 ఎకర్స్‌లో సినీ ప్రముఖుల సమావేశం జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా అక్కడికి వెళ్లిన మహేష్‌కు పవన్ అభిమానుల నుంచి గట్టి ప్రతిఘటన ఎదురైంది.
దీంతో కత్తి మహేష్ వార్‌కు మరింత ఆజ్యం పోసినట్టైంది. తనను పవన్ ఫ్యాన్స్ ఎవరైనా బూతులు తిడితే.. వాటిన్నంటినీ పవన్‌ని తిట్టేందుకు ఉపయోగిస్తానని మహేష్‌ ప్రకటించారు. తాజాగా పవన్ గురించి ఆయన ఓ ట్వీట్ పెట్టారు. ‘‘పవన్ కల్యాణ్ కాస్తా పనిలేని కళ్యాణ్ గా మారి. తన ఊహాజనిత మీడియా శత్రువుల మీద పిచ్చి ట్వీట్లు పెట్టుకుంటూ. ఆత్మన్యూనత, ఐడెంటిటి క్రైసిస్ మధ్య సంక్రమించిన ఒక ప్యారనోయా రోగిలాగా తయారై. రాజకీయ భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నాడు. ఎవరైనా కాపాడండి’’ అంటూ ట్వీట్‌లో పేర్కొన్నారు కత్తి మహేష్.