రాయుడు రఫ్పాడించాడు

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు భంగపాటు. ఉప్పల్‌ స్టేడియంలో ఆదివారం హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ 4పరుగుల తేడాతో చెన్నై సూపర్‌ కింగ్స్‌ చేతిలో ఓడింది. 183 పరుగుల లక్ష్యఛేదనలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ (51 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 84) అద్భుత ఇన్నింగ్స్‌, యూసుఫ్‌ పఠాన్‌ (27 బంతుల్లో ఓ ఫోర్‌, 4 సిక్సర్లతో 45) మెరుపులు వృథా అయ్యాయి. చెన్నై యువ బౌలర్‌ దీపక్‌ చాహర్‌ (4-1-15-3) ఆతిథ్య జట్టును దెబ్బకొట్టాడు. అంతకుముందు చెన్నై 20 ఓవర్లలో 3 వికెట్లకు 182 పరుగులు చేసిం ది. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అంబటి రాయుడు (37 బంతుల్లో 9 ఫో ర్లు, 4 సిక్సర్లతో 79)తో పాటు రైనా (43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్‌) హాఫ్‌ సెంచరీతో సత్తా చాటగా.. కెప్టెన్‌ ధోనీ (12 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 25 నాటౌట్‌) ధాటిగా ఆడాడు.
దీపక్‌ దెబ్బ… కేన్‌ కమాల్‌: భారీ లక్ష్య ఛేదనకు దిగిన సన్‌రైజర్స్‌ను చాహర్‌ ఉక్కిరిబిక్కిరి చేశాడు. వరుస ఓవర్లలో మూడు వికెట్లు తీసి ఆతిథ్య జట్టుకు షాకిచ్చాడు. ధవన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన యువ ఆటగాడు రికీ భుయ్‌ (0) ఇన్నింగ్స్‌ ఐదో బంతికే అవుటయ్యా డు. వన్‌డౌన్‌లో వచ్చిన మనీష్‌ పాండే (0) ఎదుర్కొన్న రెండో బంతి కే కర్ణ్‌శర్మకు చిక్కాడు. మరో ఎండ్‌లో విలియమ్సన్‌ క్రమం తప్పకుం డా బౌండ్రీలు కొడుతున్నా అతనికి సహకారం కరువైంది. ఐదో ఓవర్లో దీపక్‌ హుడా (1) కూడా చాహర్‌కు వికెట్‌ ఇచ్చుకున్నాడు. ఈ దశలో.. కెప్టెన్‌ కేన్‌కు సహకారం అందిస్తున్న షకీబల్‌ (19 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్‌తో 24)ను కర్ణ్‌ శర్మ అవుట్‌ చేశాడు. అప్పటికి సన్‌రైజర్స్‌ స్కోరు 11 ఓవర్లలో 78/4. ఆ తర్వాత వచ్చిన యూసుఫ్‌ పఠాన్‌ ధాటిగా ఆడలేకపోయినా.. కేన్‌ మాత్రం జడేజా బౌలింగ్‌లో సిక్సర్‌, కర్ణ్‌ శర్మ బౌలింగ్‌లో ఏకంగా మూడు సిక్సర్లు కొట్టి స్టేడియాన్ని హోరెత్తించాడు. దాంతో 15 ఓవర్లకు రైజర్స్‌ 117/4 స్కోరుతో ఆశలు సజీ వం చేసుకుంది. ఇక, అప్పటిదాకా జాగ్రత్తగా ఆడిన యూసుఫ్‌.. బ్రావో బౌలింగ్‌లో రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌కు మరింత ఊపు తెచ్చాడు. చివరి 4ఓవర్లలో ఆతిథ్య జట్టుకు 52 పరుగులు అవసరమయ్యాయి. యూసుఫ్‌ మరో సిక్సర్‌, బౌండ్రీ సాయంతో తర్వాతి రెండు ఓవర్లలో 19 రన్స్‌ రాబట్టాడు. కానీ, 18వ ఓవర్‌ చివరి బంతికి కేన్‌ను బ్రావో అవుట్‌ చేయడంతో.. సమీకరణం 12 బంతుల్లో 33 పరుగులు గా మారింది. శార్దూల్‌ వేసిన 19వ ఓవర్లో రెండో బంతిని స్టాండ్స్‌కు చేర్చిన యూసుఫ్‌ నాలుగో బంతికి అవుటైనా.. ఆరో బాల్‌ను రషీద్‌ ఖాన్‌ (4 బంతుల్లో ఫోర్‌, 2 సిక్సర్లతో 17 నాటౌట్‌) సిక్సర్‌గా మలిచా డు. ఇక, చివరి ఆరు బంతుల్లో 19 రన్స్‌ చేస్తే రైజర్స్‌దే విజయం. తొ లి మూడు బంతుల్లో సాహా (5 నాటౌట్‌) మూడు పరుగులు తీశా డు. తర్వాతి రెండు బంతులను రషీద్‌ 6, 4గా మలచి చెన్నైకి షాకిచ్చే లా కనిపించాడు. ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరమవగా.. అతను సింగిల్‌ మాత్రమే తీయడంతో రైజర్స్‌కు ఓటమి తప్పలేదు.
రాయుడు, రైనా రయ్‌.. రయ్‌..: అంతకుముందు చెన్నై ఇన్నిం గ్స్‌ ఆరంభానికి ముగింపునకు అసలు పోలికే లేదు. టాస్‌ నెగ్గి ఫీల్డిం గ్‌ ఎంచుకున్న రైజర్స్‌ బౌలర్ల ధాటికి తొలి మూడు ఓవర్లలో చెన్నై చేసింది 8 పరుగులే. పవర్‌ప్లేలో 27 రన్సే వచ్చాయి. గత

మ్యాచ్‌ సెంచరీ హీరో వాట్సన్‌ (9)ను నాలుగో ఓవర్లోనే భువీ వెనక్కుపంపా డు. మరో ఓపెనర్‌ డుప్లెసిస్‌ (11)ను రషీద్‌ స్టంపౌట్‌ చేశాడు. దీంతో 9 ఓవర్లలో జట్టు స్కోరు 41/2. ఆతిథ్య బౌలర్ల జోరు చూస్తుంటే ధోనీసేన 120 పరుగులు చేస్తే గొప్పే అనిపించింది. కానీ, ఈ మైదా నం గురించి పూర్తి అవగాహన ఉన్న లోకల్‌ బాయ్‌ అంబటి రాయు డు చెలరేగడంతో ఇన్నింగ్స్‌ స్వరూపమే మారిపోయింది. భువీ వేసిన పదో ఓవర్లో రాయుడు సిక్సర్‌, రైనా బౌండ్రీతో ఇన్నింగ్స్‌కు ఊపు తెచ్చారు. రాయుడు వచ్చిన బంతిని వచ్చినట్టు బౌండ్రీకి చేరుస్తూ స్టేడియాన్ని హోరెత్తించాడు. 27 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అంబటి.. షకీబల్‌ బౌలింగ్‌లో సిక్సర్‌, ఫోర్‌, రషీద్‌ వేసిన 16వ ఓవర్లో 4, 6 రాబట్టాడు. ఈ దశలో సులభంగా సెంచరీ చేసేలా కనిపించిన రాయుడు.. రైనాతో సమన్వయ లోపం కారణంగా రనౌట్‌గా వెనుదిరిగాడు. తానెదుర్కొన్న చివరి 16 బంతుల్లో రాయుడు 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 48 పరుగులు రాబట్టడం విశేషం. అప్పటికి 17 ఓవర్లలో చెన్నై స్కోరు 146/3. రాయుడు స్థానంలో వచ్చిన ధోనీ.. రషీద్‌ బౌలింగ్‌లో రెండు బౌండ్రీలు కొట్టాడు. కౌల్‌ వేసిన 19వ ఓవర్లోనూ మహీ రెండు ఫోర్లు రాబట్టగా.. రైనా బౌండ్రీతో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆఖరి ఓవర్లో ధోనీ సిక్సర్‌ సహా 11 పరుగులు రాబట్టడంతో జట్టు భారీ స్కోరు చేసింది.

స్కోరు బోర్డు
చెన్నై: వాట్సన్‌ (సి) హుడా (బి) భువనేశ్వర్‌ 9, డుప్లెసిస్‌ (స్టంప్డ్‌) సాహా (బి) రషీద్‌ 11, రైనా (నాటౌట్‌) 54, రాయుడు (రనౌట్‌) 79, ధోనీ (నాటౌట్‌) 25; ఎక్స్‌ట్రాలు: 4; మొత్తం: 20 ఓవర్లలో 182/3; వికెట్ల పతనం: 1-14, 2-32, 3-144; బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-22-1, స్టాన్‌లేక్‌ 4-0-38-0, షకీబల్‌ 4-0-32-0, సిద్దార్థ్‌ కౌల్‌ 4-0-33-0, రషీద్‌ ఖాన్‌ 4-0-49-1, దీపక్‌ హుడా 1-0-8-0.
హైదరాబాద్‌: రికీ భుయ్‌ (సి) వాట్సన్‌ (బి) చాహర్‌ 0, విలియమ్సన్‌ (సి) జడేజా (బి) బ్రావో 84, మనీష్‌ పాండే (సి) కర్ణ్‌ శర్మ (బి) చాహర్‌ 0, దీపక్‌ హుడా (సి) జడేజా (బి) చాహర్‌ 1, షకీబల్‌ (సి) రైనా (బి) కర్ణ్‌ శర్మ 24, యూసుఫ్‌ (సి) రైనా (బి) ఠాకూర్‌ 45, సాహా (నాటౌట్‌) 5, రషీద్‌ (నాటౌట్‌) 17; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 20 ఓవర్లలో 178/6; వికెట్ల పతనం: 1-0, 2-10, 3-22, 4-71, 5-150, 6-157; బౌలింగ్‌: దీపక్‌ చాహర్‌ 4-1-15-3, శార్ధూల్‌ ఠాకూర్‌ 4-0-45-1, వాట్సన్‌ 2-0-23-0, జడేజా 4-0-28-0, కర్ణ్‌ శర్మ 3-0-30-1, బ్రావో 3-0-37-1.

One thought on “రాయుడు రఫ్పాడించాడు

Leave a comment